మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన కేసుల్లో వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మున్సిపాలిటీ ఎన్నికల ముందస్తు ఏర్పాట్ల ప్రక్రియ చట్టబద్ధంగా జరగలేదంటూ దాఖలైన 77 రిట్ పిటిషన్లపై హైకోర్టు ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం అన్ని పిటిషన్లపై కలిపి ఒకే కౌంటరు దాఖలు చేసిందని... దానిలో తమ అభ్యంతరాలపై సమాధానం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. స్పందించిన న్యాయస్థానం... వేర్వేరు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
'మున్సిపాలిటీ ఎన్నికల వ్యాజ్యాలకు వేర్వేరు కౌంటర్లు వేయండి' - మున్సిపాలిటీ ఎన్నికల వ్యాజ్యాలు
మున్సిపాలిటీ ఎన్నికలపై దాఖలైన కేసుల్లో వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 26కు వాయిదా వేసింది.
ts high court
మున్సిపల్ ఎన్నికల కేసులను వాదించేందుకు ఓ సీనియర్ న్యాయవాదిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోందని హైకోర్టుకు అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు తెలిపారు. వ్యాజ్యాలపై తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 26కు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: 30 మంది గూండాలు, 60 కత్తిపోట్లు...ఆరోజు అసలేం జరిగింది!?