తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎన్నికలు నిర్వహించకపోవడంపై కౌంటర్ దాఖలు చేయండి: హైకోర్టు - అమరావతిలో పంచాయతీ ఎన్నికల వార్తలు

ఏపీ రాజధాని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవటంపై దాఖలైన వ్యాజ్యంపై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. గ్రామ పంచాయతీల విలీనం ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయన్న కారణంతో ఎన్నికలు నిర్వహించకపోవడం సరికాదని పిటిషనర్లు పేర్కొన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ap high court
ap high court

By

Published : Feb 17, 2021, 9:09 AM IST

ఏపీ రాజధాని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని ప్రశ్నిస్తూ పలువురు స్థానికులు హైకోర్టులో పిటిషన్ వేశారు.

గ్రామ పంచాయతీల విలీనం ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయన్న కారణంతో ఎన్నికలు నిర్వహించకపోవడం సరికాదని వారు పేర్కొన్నారు. ఆయా ప్రతిపాదనలపై ఇప్పటివరకూ ఎలాంటి పురోగతీ లేదన్నారు. ఈ మేరకు కౌంటర్‌ దాఖలుకు ఆదేశించిన న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు... విచారణను మార్చి 2కు వాయిదా వేశారు.

ఇదీ చదవండి:ఏపీ పంచాయతీ ఎన్నికలు

ABOUT THE AUTHOR

...view details