తెలంగాణ

telangana

ETV Bharat / city

'చంద్రబాబుకు ఆ సెక్షన్​ కింద నోటీసులు ఎలా ఇస్తారు..?'

తెదేపా అధినేత విశాఖ పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలపై పోలీసుల తీరును హైకోర్టు తప్పుబట్టింది. సెక్షన్​ 151 కింద చంద్రబాబుకు నోటీసు ఎలా ఇస్తారని నిలదీసింది. దీనిపై సమగ్ర అఫిడవిట్​ దాఖలు చేయాలని డీజీపీని ఆదేశించింది. చంద్రబాబు పట్ల పోలీసుల వైఖరిని నిరసిస్తూ తెదేపా మాజీ ఎమ్మెల్యే కిడారి శ్రావణ్​ కుమార్​ వేసిన లంచ్​ మోషన్​ పిటిషన్​పై విచారణ జరిపిన న్యాయస్థానం.. తదుపరి విచారణను మార్చి 2కి వాయిదా వేసింది.

babu tour case
babu tour case

By

Published : Feb 28, 2020, 9:07 PM IST

విశాఖలో నిన్న చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జరిగిన పరిణామాలపై హైకోర్టులో విచారణ జరిగింది. సెక్షన్ 151 కింద చంద్రబాబుకు నోటీసు ఇవ్వడాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఆ సెక్షన్​ కింద నోటీసు ఎలా ఇస్తారంటూ పోలీసులను నిలదీసింది. దీనిపై సమగ్ర అఫిడవిట్​ దాఖలు చేయాలని డీజీపీని ఆదేశించింది. తెదేపా అధినేత పట్ల పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్​కుమార్ హైకోర్టులో లంచ్​ మోషన్​ పిటిషన్​ దాఖలు చేశారు. వైకాపా కార్యకర్తలను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని పేర్కొన్న పిటిషనర్.. హోంశాఖ కార్యదర్శి, విశాఖ సీపీ, ఎస్పీలను ప్రతివాదులుగా చేర్చారు. విశాఖలో తెదేపా ప్రజా చైతన్య యాత్రకు అనుమతివ్వాలని కోరారు. చంద్రబాబు యాత్రకు అనుమతి తీసుకున్నామని పిటిషనర్​ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. తదుపరి విచారణను మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details