ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి మత్తు వైద్య నిపుణుడు డాక్టర్ కె. సుధాకర్ విషయంలో దాఖలు చేసిన తుది నివేదికను అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది పి. వీరా రెడ్డికి అందజేయడానికి అభ్యంతరం లేదని సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. అమికస్ క్యూరీకి నివేదిక దస్త్రాన్ని అందజేయాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. డాక్టర్ కె. సుధాకర్‌తో విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరుపై వీడియో క్లిప్పింగ్‌ను జత చేస్తూ.. తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాసిన లేఖను హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించి... విచారణ జరిపి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే.
అమికస్ క్యూరీకి తప్ప ఇంకెవరికీ ఇవ్వం..