తెలంగాణ

telangana

ETV Bharat / city

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు సీజే జస్టిస్‌ హిమా కోహ్లి - telangana news

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి, సేదవాసద్, అన్నప్రసాద భవనాన్ని సందర్శించారు.

High Court CJ Justice Hima Kohli in the service of Tirumala Srinivasa
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు సీజే జస్టిస్‌ హిమా కోహ్లి

By

Published : Mar 12, 2021, 11:33 AM IST

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం హిమకోహ్లి ప్రత్యేక పూజలు చేశారు.

మొదట పద్మావతి అతిథిగృహానికి చేరుకున్న ప్రధాన న్యాయమూర్తికి తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ఆమె సేవాసదన్‌, అన్నప్రసాద భవనాన్ని సందర్శించారు. సౌకర్యాల పట్ల భక్తులతో మాట్లాడారు.

ABOUT THE AUTHOR

...view details