తెలంగాణ

telangana

ETV Bharat / city

నేడు హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ నిరసన - telangana latest news

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్యకు నిరసనగా హైకోర్టు బార్ అసోసియన్​ విధులు బహిష్కరించాలని నిర్ణయించింది. నిందితులను త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఒక ప్రకటనలో పేర్కొంది.

high court bar association decide to boycott duties today
నేడు హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ నిరసన

By

Published : Feb 18, 2021, 8:09 AM IST

పెద్దపల్లి జిల్లా కలవచర్లలో న్యాయవాద దంపతుల హత్యకు కారకులైన దోషులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని తెలంగాణ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సంఘటనకు నిరసనగా గురువారం హైకోర్టులో విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది.

వామన్‌రావు దంపతుల హత్యను తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ తీవ్రంగా ఖండించింది. న్యాయవాదులపై ఇటీవల దాడులు ఎక్కువవుతున్నాయని, వారి రక్షణకు చట్టాన్ని తీసుకురావాలని కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చూడండి:న్యాయవాద దంపతుల హత్యకు... వాధించిన కేసులే కారణమా?

ABOUT THE AUTHOR

...view details