తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆనందయ్య మందుపై పిటిషన్.. విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ - Anandayya Medicine Case in Hi Court News today

ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఔషధం పంపిణీపై విచారణకు అనుమతించిన హైకోర్టు.. గురువారం వాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆనందయ్య మందు పంపిణీపై అనంతపురం జిల్లాకు చెందిన ఉమామహేశ్వరనాయుడు దాఖలు చేసిన పిటిషన్​ను ఉన్నత న్యాయస్థానం స్వీకరించింది.

High Court allows arguments
ఆనందయ్య మందుపై విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

By

Published : May 26, 2021, 7:17 AM IST

ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీపై విచారణకు హైకోర్టు అనుమతించింది. గురువారం దీనిపై విచారణ చేపట్టనుంది. అనంతపురం జిల్లాకు చెందిన ఉమామహేశ్వరనాయుడు అనే వ్యక్తి ఆనందయ్య మందు పంపిణీపై హౌస్‌ మోషన్‌ పిటిషన్ దాఖలు చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని పిటిషనర్లు కోరారు.

ఉన్నత న్యాయస్థానం దృష్టికి..!

లోకాయుక్త ఆదేశంతో పంపిణీ నిలిపివేసినట్లు పోలీసులు చెబుతున్నారని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మందు పంపిణీ అడ్డుకునే అధికారం లోకాయుక్తకు లేదని, మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఆదేశాలు ఇవ్వలేదని పిటిషనర్లు చెబుతున్నారు. కరోనాతో బాధపడుతున్న వారు హఠాత్తుగా మందు పంపిణీ నిలిపివేయడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని కోర్టును కోరారు.

ఇవీ చూడండి :ఆనందయ్య మందు పరిశోధన.. ఆదిలోనే అవాంతరాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details