'దర్యాప్తు పూర్తి కాకుండా.. ఎలా జోక్యం చేసుకోవాలి' - patancheru mla mahipal reddy
12:33 December 18
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అరెస్టు పిటిషన్పై విచారణ వాయిదా
పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని అరెస్టు చేయాలని విలేకరి సంతోశ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కులం పేరుతో దూషించారన్న అభియోగంపై మహిపాల్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదైనా.. పోలీసులు అరెస్టు చేయడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ఉమేశ్ చంద్ర వాదించారు.
ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ఉన్నతన్యాయస్థానం.. ఈనెల 8న కేసు నమోదైందని.. పోలీసుల దర్యాప్తు పూర్తి కాకుండా ఎలా జోక్యం చేసుకోవాలని ప్రశ్నించింది. దర్యాప్తు కొనసాగుతుండగానే జోక్యం చేసుకోవడం తగదని వ్యాఖ్యానించింది.
విలేకరి ప్రాణానికి ముప్పు ఉన్నందున.. మహిపాల్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని ఉమేశ్చంద్ర కోర్టును కోరారు. కోర్టులు జోక్యం చేసుకోవచ్చని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఉందని.. సోమవారం వరకు గడువు ఇస్తే వాటిని సమర్పిస్తామని అన్నారు. అంగీకరించిన ఉన్నత న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
- ఇదీ చూడండి :వివాహ బంధంతో ఒక్కటి కావాలనుకున్నారు.. ఇంతలోనే..