ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నా.. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమంటూ.. గతంలో ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చింది. అయితే ఈ నివేదిక అస్పష్టంగా ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. మరోవైపు చట్టబద్ధంగానే సమ్మె చేస్తున్నామని కార్మికసంఘాలు ధర్మాసనానికి విన్నవించాయి. ప్రభుత్వం, ఆర్టీసీ యూనియన్ల వైఖరితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారనని పిటిషనర్ వాదించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం... ఈనెల 15లోగా పూర్తి వివరాలతో ఆర్టీసీ, కార్మికులు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. బస్‌పాస్‌లు చెల్లుబాటయ్యేలా, అధిక ఛార్జీలు తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.
ఆర్టీసీ సమ్మెపై విచారణ ఈనెల 15కు వాయిదా - tsrtc strike latest news
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం, ఆర్టీసీ యూనియన్ల వైఖరితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారనని పిటిషనర్ వాదించారు. ఈనెల 15లోగా పూర్తి వివరాలతో ఆర్టీసీ, కార్మికులు కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ.. విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.
high court hearing tsrtc strike pil