కరోనా సమయంలో ఎంతో మందికి చేయూతనందించిన రియల్ హీరో సోనూ సూద్.. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడంతో చలించిన బాలీవుడ్ నటుడు.. ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని గతంలోనే ప్రకటించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం.. ఆక్సిజన్ ప్లాంట్‌ను నెల్లూరు జిల్లాకు పంపించారు. నగరంలోని అయ్యప్పగుడి సెంటర్ వద్దకు చేరుకున్న ఆక్సిజన్ ప్లాంట్‌కు.. సోనూసూద్ అభిమానులు ఘన స్వాగతం పలికారు.
sonu sood: సోనూ సూద్ దాతృత్వం.. ఆక్సిజన్ ప్లాంట్ అందించిన రియల్ హీరో - sonusood sent oxygen plant to nellore updates
కరోనా సమయంలో ఎంతో మందికి చేయూతనందించిన రియల్ హీరో సోనూ సూద్.. మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన ఆయన.. ఇవాళ జిల్లాకు ప్లాంట్‌ను పంపించారు. ఆక్సిజన్ ప్లాంట్‌ను జిల్లాలోని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేయనున్నారు.
sonu sood oxygen plant sonu sood oxygen plant
సర్వమత ప్రార్ధనలు నిర్వహించిన అభిమానులు.. అనంతరం బాణాసంచా కాల్చి రియల్ హీరో సోనూ సూద్‌కు అభినందనలు తెలిపారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. తన దాతృత్వంతో విపత్కర పరిస్థితుల్లో నిజమైన హీరోగా సోనూసూద్ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారని ఆయన అభిమానులు కొనియాడారు.
ఇదీ చదవండి: