టాలీవుడ్ డ్రగ్స్ కేసు(Tollywood drugs case)లో ఈడీ (enforcement directorate) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. నోటీసులు అందుకున్న ఒక్కొక్కరూ విచారణకు హాజరు హాజరుకావడంతో పాటు.. ఎక్సైజ్ కేసు(excise case)లో ప్రధాన నిందితుడుగా ఉన్న కెల్విన్(KELVIN)ను కలిపి విచారిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కెల్విన్ వద్ద సేకరించిన వివరాలతో ఒక్కొక్కరిని సుధీర్ఘంగా విచారిస్తున్నారు. ఇప్పటికే పలువురిని విచారించిన ఈడీ అధికారులు.. ఇవాళ నటుడు రవితేజ(HERO RAVI TEJA)తో పాటు అతడి డ్రైవర్ శ్రీనివాస్‌ను ఈడీ అధికారులు విచారించారు.
Tollywood Drugs Case: ముగిసిన హీరో రవితేజ, డ్రైవర్ శ్రీనివాస్ విచారణ - డ్రైవర్ శ్రీనివాస్
15:53 September 09
ముగిసిన రవితేజ, అతని డ్రైవర్ విచారణ
డ్రగ్స్ కేసు, మనీలాండరింగ్ వ్యవహారంపై రవితేజను దాదాపు 6 గంటలపాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. రవితేజ డ్రైవర్ శ్రీనివాస్‌ను కూడా అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో రవితేజ డ్రైవర్‌పై తీవ్ర అరోపణలు రావడం వల్ల.. ప్రస్తుతం ఈడీ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపింది. కెల్విన్ నుంచి డ్రైవర్ శ్రీనివాస్‌కు మాదకద్రవ్యాలు సరఫరా అయ్యాయని ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు.. డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరిగాయనే దానిపై లోతుగా విచారించినట్టు సమాచారం.
ఈ కేసులో తదుపరి విచారణ ఈనెల 13న జరగనుంది. వరుసగా మూడు రోజులు సెలవులు వస్తుండటం వల్ల.. 13న నవదీప్‌తో పాటు ఎఫ్-క్లబ్ జనరల్ మేనేజర్ విచారణకు హాజరుకానున్నారు. 15న ముమైత్ ఖాన్... 17న తనీష్, 22న తరుణ్ ఈడీ ముందు విచారణకు రావాల్సి ఉంది.
గతంలో సేకరించిన లావాదేవీలకు, వారికి మధ్య..
మొన్న నటుడు నందును విచారిస్తున్న క్రమంలో కెల్విన్‌ను అదుపులోకి తీసుకుని విచారించడం, నిన్న రానాతోపాటు కెల్విన్ కూడా విచారణకు హాజరుకావడం వెనుక ఏం జరిగిందో తెలియాల్సి ఉంది. మరోవైపు కెల్విన్ స్నేహితుడు వాహిద్ కూడా వరుసగా రెండు రోజులుగా విచారణకు హాజరవుతున్నాడు. మొదట నోటీసులు జారీ చేసిన వారిని విచారించి.. మధ్యలో కెల్విన్, వాహిద్‌ను కూడా పిలిచి ఈడీ అధికారులు విచారిస్తున్నారు. వారి నుంచి గతంలో సేకరించిన లావాదేవీలకు, విచారిస్తున్న వారికి మధ్య.. ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా అనే కోణంలో ముందుకు సాగుతున్నారు. కొన్ని అనుమానాస్పద లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
సంబంధిత కథనాలు:
- Tollywood drugs case : ముగిసిన రానా విచారణ.. కెల్విన్‌తో లావాదేవీలపై ఈడీ ఆరా
- Tollywood Drugs case : నందును 7 గంటలు, కెల్విన్‌ను 6 గంటల పాటు విచారించిన ఈడీ
- Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో రకుల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం.. ఎఫ్ క్లబ్లో ఆర్థిక లావాదేవీలపై ఆరా?
- Tollywood drugs case: ఐదు గంటలుగా సినీనటి ఛార్మి విచారణ.. ప్రశ్నల వర్షం కురిపిస్తోన్న ఈడీ
- tollywood drugs case: ముగిసిన పూరీ ఈడీ విచారణ.. అవసరమైతే మరోసారి..!