యువ హీరో రాజ్‌తరుణ్ కారు ప్రమాదం మరో మలుపు తిరిగింది. ప్రమాదం తర్వాత రాజ్‌తరుణ్ పారిపోతున్న దృశ్యాలను కార్తిక్ అనే వ్యక్తి తన చరవాణిలో చిత్రీకరించాడు. కారు ప్రమాదం ఎందుకు చేశావని రాజ్‌తరుణ్‌ను ప్రశ్నించాడు. తాను కారులో లేనని రాజ్‌తరుణ్ సమాధానం ఇచ్చారు. ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత వీడియోలను విడుదల చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాజ్‌తరుణ్, అతని మనుషులు డబ్బులు ఆశచూపడం, బెదిరించడంతోనే దృశ్యాలను బయటపెట్టాల్సి వచ్చిందని కార్తిక్ తెలిపారు.
హీరో రాజ్‌తరుణ్ కారు ప్రమాదంలో మరో మలుపు - హీరో రాజ్‌తరుణ్ కారు ప్రమాదంలో మరో మలుపు
యువ హీరో రాజ్‌తరుణ్ కారు ప్రమాదం మరో మలుపు తిరిగింది. ప్రమాదం జరిగాక రాజ్‌తరుణ్ పరిగెత్తుతున్న వీడియోలను కార్తిక్ అనే వ్యక్తి బయటపెట్టారు. ఈ వీడియోలో కారు ప్రమాదం చేసి ఎందుకు పారిపోతున్నావని రాజ్‌తరుణ్‌ను కార్తిక్ ప్రశ్నించారు.. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
![హీరో రాజ్‌తరుణ్ కారు ప్రమాదంలో మరో మలుపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4214603-34-4214603-1566497152716.jpg)
హీరో రాజ్‌తరుణ్ కారు ప్రమాదంలో మరో మలుపు
ప్రమాదం జరిగిన రోజునే హీరో రాజ్‌తరుణ్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. కారు అదుపు తప్పిన సమయంలో తానే డ్రైవ్ చేసినట్లు వీడియోలో తెలిపారు. ఈ ప్రమాదంపై సుమోటోగా కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు..ఇప్పటి వరకు రాజ్ తరుణ్‌ను ప్రశ్నించలేదు.
హీరో రాజ్‌తరుణ్ కారు ప్రమాదంలో మరో మలుపు
ఇవీ చూడండి: హీరో రాజ్ తరుణ్‌కు ప్రమాదం నేర్పిన పాఠం!