pawan kalyan awareness on Corona: దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకం అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వైద్య నిపుణుల సూచనలు అనుసరించాలని కోరారు. భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు... తప్పనిసరిగా మాస్క్ వాడాలని సూచించారు. విందులు, సమావేశాలు వంటి వాటిని కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు. రాబోయే సంక్రాంతిని కుటుంబసభ్యులతో మాత్రమే జరుపుకోవడానికి ప్రయత్నించాలని కోరారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మహమ్మారిని పారదోలాలని అన్నారు.
ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాలి..