తెలంగాణ

telangana

ETV Bharat / city

Mohan Babu land issue : 'మోహన్​బాబు, విష్ణులవి పట్టా భూములే' - Mohanbabu land issue

Mohan Babu land issue : సినీ నటుడు మోహన్​బాబు​, ఆయన కుమారుడు విష్ణు పేరుపై ఉన్న పట్టా భూముల రికార్డులను తహసీల్దార్​ పరిశీలించారు. భూమిపై ఇప్పటివరకు 11 సార్లు క్రయవిక్రయాలు జరిగినట్లు తెలిపారు.

Mohanbabu land issue
Mohanbabu land issue

By

Published : Mar 3, 2022, 8:38 AM IST

Mohan Babu land issue : సినీ నటుడు మంచు మోహన్‌బాబు, ఆయన కుమారుడు విష్ణు పేరిట దరఖాస్తు పట్టా భూములు ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన నేపథ్యంలో.. రికార్డులను చంద్రగిరి తహసీల్దార్‌ శిరీష పరిశీలించారు. రెవెన్యూ రికార్డుల మేరకు రామిరెడ్డిపల్లి-68 గ్రామ రెవెన్యూ సర్వే నంబరు 412-1లో 5.29 ఎకరాల భూమికి 1928లో దరఖాస్తు పట్టాలు మంజూరు చేసినట్లు చెప్పారు.

11సార్లు క్రయవిక్రయాలు

Mohan Babu land issue News : ఈ భూమిపై 1942 నుంచి 2001 వరకు 11 సార్లు క్రయవిక్రయాలు జరిగాయన్నారు. 18.6.1954 కంటే ముందు మంజూరైన దరఖాస్తు పట్టా భూములను... నిషేధిత జాబితా నుంచి తొలగించాలని 2016లో జీవో 215ను రాష్ట్రప్రభుత్వం జారీ చేసిందని తెలిపారు. ఈ క్రమంలో మోహన్‌బాబు, విష్ణు పేరిట ఉన్న భూములు డీకేటీ నుంచి పట్టా భూములుగా మారాయని వివరించారు. ఆన్‌లైన్‌లో డీకేటీగా కొనసాగడంతో ఈ సమస్య తలెత్తిందని స్పష్టం చేశారు.

అసలేం జరిగిందంటే..

Mohan Babu Land controversy : సాగుభూమి లేని నిరుపేదలకు కేటాయించే దరఖాస్తు పట్టాలను.. సినీ ప్రముఖులకు మంజూరు చేయడం చర్చనీయాంశమైంది. సినీనటుడు మోహన్‌బాబు, ఆయన కుమారుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుల పేరిట దరఖాస్తు పట్టా భూములు మంజూరు చేసినట్టు ఆన్‌లైన్‌ రెవెన్యూ రికార్డుల్లో బహిర్గతం కావడంతో కొందరు ఆ వివరాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి ‘సినీ ప్రముఖులు కూడా నిరుపేదలా?’ అంటూ విమర్శలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details