తెలంగాణ

telangana

ETV Bharat / city

Manchu Vishnu Help: సాయితేజ పిల్లలను నేను చదివిస్తా: మంచు విష్ణు - మంచు విష్ణు సహాయం

Manchu Vishnu Help: హెలికాప్టర్​ ప్రమాదంలో త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​తో పాటు మృతిచెందిన చిత్తూరు జిల్లా వాసి సాయితేజ కుటుంబానికి మంచు విష్ణు అండగా నిలిచారు. తమ విద్యా సంస్థలో సాయితేజ పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని విష్ణు హామీ ఇచ్చారు.

Manchu Vishnu
Manchu Vishnu

By

Published : Dec 9, 2021, 7:16 PM IST

Manchu Vishnu Help: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సాయితేజ కుటుంబానికి మంచు విష్ణు అండగా నిలిచారు. సాయితేజ కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన విష్ణు.. తమ విద్యా సంస్థలో సాయితేజ పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. పిల్లలను ఇంజినీరింగ్ వరకు ఉచితంగా చదివిస్తామని మంచు విష్ణు వెల్లడించారు.

ఆర్మీ జవాన్​గా చేరి..
సాయితేజ్.. 2013లో ఆర్మీ జవాన్​గా చేరారు. సిపాయిగా పనిచేస్తూ పారా కమెండోగా ఎంపికయ్యారు. లెవెన్త్ పారాలో లాన్స్ నాయక్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. బెంగళూరులో సిపాయిలకు శిక్షకుడుగా పనిచేసిన సాయితేజ్.. ప్రస్తుతం బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రతలో విధులు నిర్వర్తిస్తున్నారు. సాయితేజ్​కు భార్య శ్యామల, కుమారుడు మోక్షజ్ఞ, కూతురు దర్శిని ఉన్నారు. వీరి కుటుంబం ఏడాదిగా మదనపల్లె ఎస్​బీఐ కాలనీలో నివాసం ఉంటోంది. బుధవారం ఉదయం 8:15కు సాయితేజ్ ఓసారి ఫోన్ చేశారని.. 8:45 వీడియో కాల్ చేసి పిల్లలతో మాట్లాడారని కుటుంబసభ్యులు తెలిపారు.

అంతులేని విషాదం..

Bipin Rawat passed away: హెలికాప్టర్​ ప్రమాదంలో త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఆయన ప్రయాణిస్తున్న Mi-17V5 చాపర్​ బుధవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 14 మందికిగానూ 13 మంది చనిపోయారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details