NTR Centenary: తెలుగు ప్రజల ఆరాధ్యనటుడు, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆయన కుమారుడు, నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్ణయించారు. ఈ నెల 28న ఏపీలోని నిమ్మకూరులో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను బాలకృష్ణ ఘనంగా ప్రారంభించనున్నారు. అదేరోజు మధ్యాహ్నం గుంటూరు, తెనాలిలోనూ ఉత్సవాల్లో పాల్గొంటారు.
'10 కోట్ల మంది తెలుగు ప్రజల ఇంటి పండుగ... ఎన్టీఆర్ శత జయంతి' - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
NTR Centenary: తెలుగు ప్రజలు ఆరాధ్య ధైవంగా భావించే నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆయన కుమారుడు, నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్ణయించారు. ఏడాది పాటు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను నిర్వహించేలా బాలకృష్ణ ఏర్పాట్లు చేస్తున్నారు.
బాలకృష్ణ
ఏడాది పాటు ఎన్టీఆర్ శతజయంతి సంబరాలను నిర్వహించేలా బాలకృష్ణ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలంటే 10 కోట్ల మంది తెలుగు ప్రజల ఇంటి పండుగ అని బాలకృష్ణ అన్నారు. ఈ ఉత్సవాల్లో అభిమానులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి:'ఆ మెసేజ్‌లు సేవ్ చేసి.. మీ లైఫ్‌ను సేవ్ చేస్కోండి'