తెలంగాణ

telangana

ETV Bharat / city

Holi Tips: హోలీ వేడుకలకు వెళ్తున్నారా.. ఇవి తప్పనిసరి!

Holi Tips: హోలీ... రంగులు, నీళ్లతో సమయమే తెలియకుండా ఆడతాం. అప్పుడు బానే ఉంటుంది. తర్వాతే రంగులు వదల్లేదనో, చర్మ సమస్యలనో ఇబ్బంది పడతాం. అందుకే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి...

tips for safe holi
tips for safe holi

By

Published : Mar 18, 2022, 8:28 AM IST

Holi Tips: హోలీ రోజు రెండు, మూడు లేయర్లుగా మాయిశ్చరైజర్‌ రాయాలి. చెవులు, వాటి వెనక భాగాల్నీ వదలొద్దు. ఇది రంగుల ప్రభావం చర్మంపై పడకుండా కాపాడుతుంది. కనీసం ఎస్‌పీఎఫ్‌ 30 ఉన్న సన్‌స్క్రీన్‌ను తప్పక రాయాలి. నీళ్లతో ఆడే అవకాశాలే ఎక్కువ కాబట్టి, వాటర్‌ప్రూఫ్‌వి ఎంచుకుంటే మంచిది. కనీసం 15-20 నిమిషాల ముందు ఆలివ్‌, బాదం, కొబ్బరి నూనెల్లో ఏదో ఒకదాన్ని తప్పక మేనంతా రాసుకోండి. పెదాలనూ నిర్లక్ష్యం చేయొద్దు. పెట్రోలియం జెల్లీ పూయండి. లిప్‌స్టిక్‌ అలవాటున్నా.. దీన్ని రాశాకే అప్లై చేయండి. గోళ్లు పెద్దగా ఉంటే కత్తిరించాలి. లేదంటే వాటిల్లోకి చేరిన రంగులు ఆహారంతో కలిసి కడుపులోకి వెళ్లే ప్రమాదముంది. నెయిల్‌ పెయింట్‌ వేస్తే.. గోళ్లపై మరకల్లా ఉండిపోవు, నిర్జీవంగానూ తయారవకుండా ఉంటాయి.

కేశాలకి.. వెంట్రుకలూ రసాయనాల వల్ల తేమను కోల్పోతాయి. కాబట్టి, కొబ్బరి లేదా బాదం నూనెను మాడు నుంచి చివర్ల వరకు తప్పక పట్టించాలి. జిడ్డుగా కనిపిస్తుందనిపిస్తే.. లీవ్‌ ఇన్‌ కండిషనర్‌ రాస్తే సరి. తలస్నానం చేశాక చిక్కులు తొలగడానికీ, మెరవడానికీ సీరంగా ఉపయోగిస్తాం కదా! అదే ఇది. ఈ జాగ్రత్తలు పాటించేయండి.. పండగ తర్వాతా ఆనందమే గుర్తుంటుంది.

ఇవీచూడండి:

ABOUT THE AUTHOR

...view details