తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈ జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్ బిల్లుల 'మోత మోగదు'! - electricity usage in ap news

నేటి సాంకేతిక యుగంలో విద్యుత్‌తో నడవని పరికరం ఏమైనా ఉందా...? అంతెందుకు... విద్యుత్‌ లేని క్షణాన్ని ఊహించుకోగలమా...? ఇలా ఎంతో విలువైన విద్యుత్‌ను తెలియకుండానే వృథా చేస్తున్నాం. పాత పరికరాల వినియోగానికి తోడు... విద్యుత్తు వాడకంపై అవగాహనా లోపంతో బిల్లులు తడిసిమోపెడవుతున్నాయి. ఈ తరుణంలో కొన్ని జాగ్రత్తలు, మెలకువలు పాటించడం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయొచ్చునని నిపుణులు చెబుతున్నారు.

STORY ON HABITS
ఈ జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్ బిల్లుల 'మోత మోగదు'!

By

Published : Dec 25, 2020, 3:05 PM IST

ఈ జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్ బిల్లుల 'మోత మోగదు'!

విద్యుత్ నిత్యావసర వస్తువే.... అయినప్పటికీ ఎక్కడా దాచుకోవడానికి వీల్లేదు. నిరంతర ప్రవాహంలోనే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఒకప్పటితో పోల్చితే తలసరి విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. కొత్త విద్యుత్ ఆధారిత గృహోపకరణాలు తయారవుతున్నాయి. కొందరికి బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొట్టే పరిస్థితి తలెత్తుతోంది. విద్యుత్ పరికరాల వాడకంపై కొందరు వినియోగదారుల్లో అవగాహన లేకపోవడం వల్లే విద్యుత్ వృథా, ఛార్జీల భారం తప్పడం లేదని నిపుణులు అంటున్నారు.

ఇలా చేస్తే ఆదా

విద్యుత్ జాతీయ సంపద. ఇళ్లలోనే కాకుండా వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లోనూ విద్యుత్ ఆదా చేయాల్సిన అవసరముందంటున్నారు నిపుణులు. పాత మోటార్ల స్థానంలో కొత్త ఎనర్జీ మోటార్లు, మోటార్లకు కెపాసిటర్లు బిగించడం ద్వారా ఇంధనం ఆదా చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. అలాగే త్రీ స్టార్ లేదా ఫైవ్‌ స్టార్ విద్యుత్ గృహోపకరణాలు వాడటం వల్ల 50 శాతం వరకు విద్యుత్ ఆదా కానుంది.

విద్యుత్ వృథాను అరికట్టేందుకు ప్రజలు కృషి చేస్తే భావితరాలకు విద్యుత్‌ అందించవచ్చని నిపుణులు అంటున్నారు. ఇంధనం ఆదాతోపాటు బొగ్గు వినియోగం తగ్గించడం ద్వారా.. పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఇవీచూడండి:'మీరు ఫిర్యాదు ఇవ్వండి.. మిగతాది మేం చూసుకుంటాం'

ABOUT THE AUTHOR

...view details