హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో రహదారులకు అడ్డంగా భారీ వృక్షాలు, టెలిఫోన్, విద్యుత్ స్తంభాలు రోడ్లకు అడ్డంగా కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో రాత్రి మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఎక్కడికక్కడ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.