ఒక నర్సు ఇంటికి వద్దకు వచ్చి సేవలు అందించాలంటే ఒక విజిట్‌కు రూ.800-1000 వరకు తీసుకుంటున్నారు. ఇక వైద్యుడే రావాలంటే ఇంకా ఎక్కువే వసూలు చేస్తున్నారు. పేదలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఈ ఖర్చును భరించలేని పరిస్థితి ఉంది. ఇలాంటి వారికి నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్(Helping Hand Foundation) చేదోడు వాదోడుగా నిలుస్తోంది. హెచ్‌హెచ్‌ఎఫ్ హెల్త్(HHF Health Services) పేరుతో అతి తక్కువ ఫీజుతో సేవలు అందిస్తోంది. అవీ భరించలేని పేదలకు ఉచితంగా అందించనున్నారు. వైద్యులు, టెక్నీషియన్లు, నర్సులు, ఇతర సిబ్బంది కలిసి 30-40మంది బృందం పనిచేయనుంది.
- డాక్టర్ ఆన్ కాల్ లేదా విజిటింగ్, నర్సింగ్, బెడ్‌సైడ్ కేర్, ఫిజియోథెరఫీ, ల్యాబ్స్, డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ, అంబులెన్సులు, వైద్య పరికరాలు, పునరావాస సంరక్షణ, ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించడం, ఇంజెక్టబుల్స్, గాయాలకు డ్రసింగ్, బెడ్ సోర్‌కేర్, ఫోలే కాథెటర్ రీప్లేస్‌మెంట్ తదితర సేవలు ఇందులో భాగం చేశారు.
- పక్షవాతం, ట్రామా, డయాబెటిక్, గ్యాంగ్రేన్, సెల్యులైటిస్ తదితర క్లిష్ట సమస్యలకు చికిత్సలు చేయనున్నారు.
సేవలను మరింత విస్తరించనున్నాం