దేశంలో కేంద్ర జలసంఘం పర్యవేక్షణలో ఉన్న 123 జలాశయాలు అత్యధికంగా నీళ్లతో కళకళలాడుతున్నాయని ఆ సంఘం నివేదిక విశ్లేషించింది. గడిచిన పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదంది. మొత్తం 123 జలాశయాల్లో గురువారం నాటికి 66.372 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బీసీఎం) నీళ్లు ఉన్నట్లు పేర్కొంది. జలాశయాల మొత్తం నీటి నిల్వ సామర్థ్యంలో ఇది 39శాతం. అంటే వర్షాకాలం ప్రారంభమైన తొలినాళ్లలోనే మూడింట ఒక వంతుకు పైగా జలాశయాలు నీళ్లతో కనిపిస్తుండటం గమనార్హం. గతేడాది ఇదే సమయానికి 42.826 బీసీఎం నీళ్లే ఉన్నాయి. అదే 10 సంవత్సరాల సగటు పరిశీలిస్తే 55.824 బీసీఎంలే. గత సంవత్సరంతో పోల్చినా 155శాతం అధికంగా నీళ్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
కృష్ణా, గోదావరి నదుల్లో సాధారణం కన్నా ఈ ఏడాది ప్రవాహాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే గత పదేళ్ల సగటు ప్రవాహాల కన్నా ఎక్కువ ఉన్నాయి. గంగా, నర్మద, కావేరి, మహానది, ఇండస్, శబర్మతి, తపతిలోనూ ప్రవాహాలు బాగానే ఉన్నాయి. పశ్చిమానికి ప్రవహించే నదుల్లో మాత్రం నీటి ప్రవాహాలు ఇలా లేవు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కేంద్ర జల సంఘం పర్యవేక్షణలో మొత్తం 36 జలాశయాలు ఉన్నాయి. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 52.81 బిలియన్ క్యూబిక్ మీటర్లు కాగా ప్రస్తుతం 18.69 బీసీఎం నీళ్లున్నాయి.
'సాధారణం కన్నా ఈ ఏడాది జలశయాలు కళకళలాడుతున్నాయ్..' - heavy water flow to Krishna
కృష్ణా, గోదావరి నదుల్లో సాధారణం కన్నా ఈ ఏడాది ప్రవాహాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర జల సంఘం నివేదికలో విశ్లేషించింది. దేశంలోని 123 జలశయాల్లో పుష్కలంగా నీరు ఉందని వెల్లడించింది. ఈ తరహా నీటి నిల్వలు పదేళ్లలో ఎప్పుడూ లేవని అభిప్రాయపడింది.
'మా పర్యవేక్షణలోని జలశయాలు కళకళలాడుతున్నాయ్..'