తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో ముంపు బారిన కృష్ణా తీర ప్రాంతాలు - krishna river floods

భారీ వర్షాల కారణంగా ఏపీలోని ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తింది. అధికారులు దిగువకు వరద నీటిని విడుదల చేయటం వల్ల కృష్ణా తీర ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి.

heavy-water-floods-in-kollur-guntur-district
ఏపీలో ముంపు బారిన కృష్ణా తీర ప్రాంతాలు

By

Published : Oct 15, 2020, 9:17 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా వరద నీరు దిగువకు విడుదల చేయటం వల్ల కృష్ణా తీర ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. దుగ్గిరాల, కొల్లిపొర, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. వేల ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగి చెరువులను తలపిస్తున్నాయి.

గుంటూరు జిల్లాలోని కొల్లూరు మండలంలో వరద తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల కరకట్ట నుంచి లంక గ్రామాల్లోకి వెళ్లే రోడ్లపైకి వరద నీరు చేరింది. దీంతో 11 లంక గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించగా.. సహాయ చర్యలు చేపట్టారు.

ఇవీ చూడండి: వర్షాలు తగ్గినా కొనసాగుతోన్న వరద ఉద్ధృతి

ABOUT THE AUTHOR

...view details