Heavy traffic jam due to flood affected vehicles: రాత్రి కురిసిన భారీ వర్షాలకు మేడ్చల్ జిల్లా సుచిత్ర నుంచి కొంపల్లి వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ భారీ వర్షానికి కుత్బుల్లాపూర్ కొంపల్లి నుంచి దూలపల్లి వెళ్లే ప్రధాన రహదారి కోతకు గురైంది. ప్రధాన రహదారిపై నీటి ప్రవాహం మోకాలి లోతులో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసరంగా వెళ్లేవారు ఒకరికొకరు సహాయం తీసుకొని వరద నీటిలో నుంచి రోడ్డును దాటుతున్నారు.
వరదతో హైదరాబాద్లో ట్రాఫిక్‌కు అంతరాయం
Heavy traffic jam due to flood affected vehicles: గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు నగరంలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో వాగులు ఉద్ధృతంగా ప్రవహించి, రోడ్డును కోతకు గురిచేస్తున్నాయి. మేడ్చల్ జిల్లా సుచిత్ర నుంచి కొంపల్లి వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు.
ఈ రోడ్డు కోతకు గురవ్వడంతో దీని ప్రభావం నగరం నుంచి మేడ్చల్ కరీంనగర్ హైవే వైపు వెళ్లే వాహనాలపై పడింది. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్డుపై నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, అత్యవసర సేవలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలు నిలిచిపోవడంతో అందులో అంబులెన్స్ సైతం ఇరుక్కుపోయింది. పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. జీడిమెట్ల, సూరారమ్ తదితర ప్రాంతాలలో ఉన్న చెరువులు పూర్తిగా నిండి నీరు పొంగడంతో రోడ్డు పై ప్రవహిస్తుంది.
ఇవీ చదవండి: