pushpa pre release event: హైదరాబాద్ యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు వద్ద భారీ ఎత్తున ట్రాఫిక్‌జామ్ అయ్యింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దానికి కారణం.. పుష్ర సినిమా ప్రీ లాంట్ కార్యక్రమం. అసలు విషయమేంటంటే.. యూసుఫ్‌గూడ పోలీసు పరేడ్ మైదానంలో పుష్ప సినిమా ప్రీ లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఐకాన్‌స్టార్ అభిమానులు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Pushpa pre release event: అభిమానులతో కిక్కిరిసిపోయిన రోడ్లు.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం.. - heavy traffic jam at yousufguda check post
pushpa pre release event: హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ ప్రాంతం ఎప్పుడూ లేనంతగా జనాలతో కిక్కిరిసిపోయింది. దానికి కారణం.. అల్లు అర్జున్ అభిమానులు. పుష్ప సినిమా ప్రీ లాంచ్ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి అల్లు అర్జున్ అభిమానులు పోటెత్తటంతో.. రహదారులన్ని బ్లాక్ అయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బంది ఎదురైంది.
heavy traffic jam at yousufguda check post due to Pushpa pre release event
పుష్పం చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి రానున్న నేపథ్యంలో యూసుఫ్‌గూడ పోలీసు చెక్‌పోస్టు ప్రాంతం సందడిగా మారింది. అల్లు అర్జున్ అభిమానులు పోటెత్తడంతో.. రహదారులు కిక్కిరిసిపోయాయి. భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకోవటం వల్ల.. సాధారణ వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ ఎక్కువై.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇదీ చూడండి: