తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Heavy Rains: రాష్ట్రంలో రాగల మూడురోజులు అతి భారీ వర్షాలు! - Rainfall Alert

రాబోయే మూడు రోజులపాటు అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు.. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉరుములు మెరుపులతో పాటు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులతో వర్షాలు కరుస్తాయని పేర్కొన్నారు.

heavy-to-very-heavy-rainfall-alert-for-the-next-48-hours-in-several-parts-of-telangana
heavy-to-very-heavy-rainfall-alert-for-the-next-48-hours-in-several-parts-of-telangana

By

Published : Jul 22, 2021, 2:16 PM IST

రాష్ట్రంలో వరుణుడి ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడుతున్నాయి. ఇవాల్టి మరో మూడు రోజుల పాటు అనేక ప్రదేశాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు.. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

బలపడిన అల్పపీడనం...

ఈరోజు ఉదయం వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా... సముద్రమట్టానికి సగటున 7.6 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఉరుములు మెరుపులతోపాటు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులతో వర్షాలు పడుతాయని పేర్కొన్నారు.

ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు...

"వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడగా... ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇవాళ రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకట్రెండు చోట్ల అతిభారీ నుంచి అత్యంత భారీ వానలు కురవనున్నాయి. రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఒకట్రెండు చోట్ల భారీ వానలు కురిసే అవకాశం ఉంది."- వాతావరణ కేంద్రం.

జిల్లాల్లోనూ భారీ వర్షాలు...

నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్‌కర్నూలు, జగిత్యాల, ఖమ్మం, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్‌ గ్రామీణం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, వికారాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా కురియనున్నట్లు తెలిపారు. ఈశాన్య, తూర్పు తెలంగాణా జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల.. అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

జంటనగరాల్లో మోస్తరు వర్షాలు...

జంట నగరాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నట్టు అధికారులు తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సీయస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సీయస్ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: Telangana Rains: ప్రజలెవ్వరూ ఇళ్లలో నుంచి బయటకురావద్దు: సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details