Tirupati heavy rush: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేయడంతో ఆందోళనకు దిగుతున్నారు. వరుస సెలవులు కావడంతో శ్రీవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుపతికి తరలివచ్చారు. అయితే.. ఈనెల 12వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్లు జారీ శనివారం రోజే పూర్తికావడంతో ఆది, సోమ వారాల్లో టోకెన్ల జారీ నిలిపివేశారు. దీనిపై సమాచారం లేకపోవడంతో భక్తులు.. తిరుపతికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని ఆందోళనకు దిగారు. తితిదే అధకారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tirupati heavy rush: తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శన టోకెన్ల కోసం ఆందోళన - తిరుమలలో ప్రత్యేక దర్శనాలు
Tirupati heavy rush: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. కరోనాతో రెండేళ్లుగా రద్దు చేసిన వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి ప్రత్యేక ప్రవేశ దర్శనాలను తితిదే పునరుద్ధరించడం, వరుస సెలవులు కావడంతో శ్రీవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుపతికి తరలివచ్చారు.
Special Darshanam at Tirumala: కరోనాతో రెండేళ్లుగా రద్దు చేసిన వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి ప్రత్యేక ప్రవేశ దర్శనాలను తితిదే పునరుద్ధరించింది. రోజుకు వెయ్యి టికెట్ల చొప్పున సమయ నిర్దేశిత టోకెన్లను తితిదే ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. టికెట్లు తీసుకున్న భక్తులను ప్రతిరోజు ఉదయం 10 గంటలకు దర్శనానికి అనుమతిస్తున్నారు.తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్, నావెల్ చీఫ్ అడ్మిరల్ హరి కుమార్, సినీ నటులు జీవిత రాజశేఖర్ దంపతులతో పాటు కుమార్తెలు శివాణి, శివాత్మికతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. మే నెలలో రాజశేఖర సినిమా విడుదల కానున్న నేపథ్యంలో స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చామని జీవిత తెలిపారు.
ఇదీ చదవండి :వడ్లకు మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ 48 గంటల దీక్ష..