మృగశిర కార్తెను పురస్కరించుకుని రాష్ట్రంలో ఇవాళ చేపల విక్రయాలు జోరందుకుంది. హైదరాబాద్ ముషీరాబాద్‌లోని చేపల మార్కెట్.. జనంతో కిక్కిరిసింది. చేపల ధరలు రెండింతలు చేసి అమ్ముతున్నారని.. వినియోగదారులు ఆరోపించారు. మూడు కిలోలు కొనే చోటా 2 కిలోలు కొనుగోలు చేసినట్లు వివరించారు. లాక్డౌన్ సడలింపులతో కరోనా కేసులు పెరుగుతుంటే.. ప్రజలు మాత్రం భౌతిక దూరం నిబంధన గాలికొదిలేసి.. మాస్కుల మాటే మరచి చేపలు కొనేందుకు ఎగబడ్డారు. రోజూ రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో కొవిడ్-19 కేసులు నమోదవుతున్నా.. లాక్డౌన్ నియమాలు గాలికొదిలేశారు ప్రజలు.
చేపల కొనుగోళ్లకు ఎగబడ్డ జనం.. - హైదరాబాద్ తాజా వార్తలు
లాక్డౌన్ సడలింపుల ఫలితంగా ప్రజల రాకపోకలు అధికమయ్యాయి. కొన్ని చోట్ల లాక్డౌన్ నిబంధలను బాగానే అమలువుతున్నా.. బహిరంగ మార్కెట్లలో మాత్రం అసలు కరోనా ఉందా అనేలా ప్రజలు వ్యవహరిస్తున్నారు. భౌతిక దూరం సూత్రాన్ని గాలికొదిలేస్తున్నారు.
చేపల కొనుగోళ్లకు ఎగబడ్డ జనం..