తెలంగాణ

telangana

ETV Bharat / city

బలపడనున్న అల్పపీడనం.. 24 గంటల్లో భారీ వర్ష సూచన - heavy-rains-to-be-fall-in-state-in-upcoming-hours in telangana and ap

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి తెలంగాణ, ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.

heavy-rains-to-be-fall-in-state-in-upcoming-hours in telangana and ap
బలపడనున్న అల్పపీడనం.. 24 గంటల్లో భారీ వర్ష సూచన

By

Published : Aug 5, 2020, 11:54 AM IST

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 24గంటల్లో అల్పపీడనం మరింత బలపడనుందని వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తర ఒడిశా, పశ్చిమబంగా దిశగా కదులుతూ... ఉత్తర కోస్తాంధ్ర, తెలంగాణ యానాంకు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది.

తెలంగాణ, కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో, ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతవరణ శాఖ తెలిపింది.

ఇదీ చదవండి :తెలంగాణలో కొత్తగా 2,012 కరోనా పాజిటివ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details