తిరుమల కొండపై ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం (heavy rains in tirumala, tirupati) పడుతోంది. గాలుల తీవ్రతకు నడకమార్గంతోపాటు కనుమ దారుల్లో పదుల సంఖ్యలో చెట్లు కుప్పకూలాయి. గాలిగోపురం వద్ద చెట్టు పడిపోవడంతో మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి(shops destroyed). భారీగా వీచిన గాలులకు దుకాణాల పైకప్పులు ఎగిరిపోయాయి. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గంలోనూ భారీ వృక్షాలు కూలిపోయాయి. కనుమదారుల్లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. రాళ్లను తితిదే సిబ్బంది తొలగిస్తోంది. ముందుజాగ్రత్తగా పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తితిదే తాత్కాలికంగా మూసివేసింది. తీర్థాల వద్ద భారీ ప్రవాహంతో భక్తుల సందర్శన నిలిపివేశారు. జీఎన్సీ విచారణ కార్యాలయం, ఎంబీసీ వద్ద ఉన్న జలప్రసాదం కేంద్రంపై చెట్టు పడింది. ఈ సమయంలో అక్కడ భక్తులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
నిండుకుండలా జలాశయాలు...
అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వానతో తిరుమల జలాశయాల్లోకి(dams at tirumala) పెద్దఎత్తున వరదనీరు చేరుతోంది. పాపవినాశనం(papavinashanam), గోగర్బం జలాశయాల(gogarbham dam) గేట్లు ఎత్తి నీటికి కిందికి వదులుతున్నారు. జంట జలాశయాలైన కుమారధార, పసుపుధార నిండుకుండను తలపిస్తున్నాయి. తిరుమలలో ఎడతెరిపి లేని వర్షాలతో యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు, దర్శనం చేసుకున్నవారు తిరిగి గదులకు చేరుకునేందుకు వానలో తడుస్తూ అవస్థలు పడాల్సి వస్తోంది. తిరుమాడ వీధుల్లోకి మోకాళ్ల లోతు నీరు చేరింది. ఈదురుగాలులకు చెట్లు, కొమ్మలు విరిగి పడుతుండటం వల్ల బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా యాత్రికులను అప్రమత్తం చేశారు.
లోతట్లు ప్రాంతాలు జలమయం...