తెలంగాణ

telangana

ETV Bharat / city

నేడు, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు - Hyderabad rains news

Heavy rains in Telangana రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు పడనున్నాయి. నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Heavy rains
భారీ వర్షాలు

By

Published : Aug 27, 2022, 9:05 AM IST

Heavy rains in Telangana: కర్ణాటక ఉత్తర ప్రాంతంపై నుంచి శ్రీలంక వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితలద్రోణి ఏర్పడింది. రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. వీటి ప్రభావంతో శని, ఆదివారాల్లో తెలంగాణలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. గురువారం ఉదయం 8 నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకూ కొన్ని ప్రాంతాల్లో వానలు పడ్డాయి. ఫణిగిరి(సూర్యాపేట జిల్లా)లో అత్యధికంగా 12.6, గుండాల(యాదాద్రి)లో 10.2, భీమవరం(జోగులాంబ)లో 8.9, వీపనగండ్ల(వనపర్తి)లో 8.9, నాగారం(సూర్యాపేట)లో 8.2, పడమటిపల్లె(నల్గొండ)లో 6.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉష్ణోగ్రత కొన్ని ప్రాంతాల్లో సాధారణంకన్నా 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details