బంగాళాఖాతం ఈశాన్య ప్రాంతంలో 5.8 కి.మీ.ల ఎత్తు నుంచి 7.6 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. గురువారానికి మరింత బలపడి పశ్చిమ దిశగా పయనిస్తుందని అంచనా. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య 4.5 కి.మీ.ల నుంచి 7.6 కి.మీ.ల ఎత్తు వరకు గాలులు కొనసాగుతున్నాయి.
రాష్ట్రంలో నేడు భారీ, రేపు అతి భారీ వర్షాలు - weather update
రాష్ట్రంలో నేడు భారీ, రేపు అతి భారీ వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు వివరించారు.
heavy rains in telangana
మరోవైపు మధ్యప్రదేశ్‌పై ఉన్న అల్పపీడనం బలహీనపడింది. కానీ, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో బుధవారం భారీగా, గురువారం అతి భారీగా అక్కడక్కడా వర్షాలు రాష్ట్రంలో కురిసే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్‌లో 9.6, మంగపేట (ములుగు)లో 9.6, కొల్లూరు (కామారెడ్డి)లో 9.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.