తెలంగాణ

telangana

ETV Bharat / city

Rains in Telangana: తెలంగాణలో వర్షాలు.. ఈరోజు నుంచి మూడు రోజులు..!

తెలంగాణలో ఈరోజు, రేపు.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు(rains latest news) పడుతాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం(hyderabad weather report) తెలిపింది. రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(rains in telangana) కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

By

Published : Nov 12, 2021, 5:08 PM IST

Heavy rains in telangana for three days
Heavy rains in telangana for three days

తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(rains in telangana) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం(hyderabad weather report) ప్రకటించింది. ఈరోజు, రేపు.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు(rains latest news) పడతాయని తెలిపింది. నిన్న ఉత్తర తమిళనాడు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం ఈరోజు బలహీనపడి ఉత్తర అంతర్గత తమిళనాడు(rain in tamilnadu latest news) పరిసర ప్రాంతాలలో అల్పపీడనంగా కొనసాగుతోందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు.

అల్పపీడన అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని డాక్టర్​ నాగరత్న వెల్లడించారు. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఒక ఉపరితల ద్రోణి కోస్తాంధ్రప్రదేశ్‌ మీదుగా ఉత్తర ఒడిశా కోస్తా వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిందని పేర్కొన్నారు. రేపు దక్షిణ అండమాన్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 15న తూర్పు మధ్య పరిసర బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోకి ఈశాన్య దిక్కుల నుంచి గాలులు వీస్తున్నట్లు ప్రకటించారు.

ఏపీలో కుండపోత వర్షాలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో కుండపోత వానలు(heavy rains in andhra pradesh today) కురుస్తున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు ప్రమాదక స్థితికి చేరాయి. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. తిరుమల కొండపై భారీ వర్షం (heavy rains in tirumala) కురిసింది. అలిపిరి నడక మార్గంలో వరద ప్రమాదకరంగా ప్రవాహించింది. భయాందోళనకు గురైన భక్తులు.. మెట్ల మార్గానికి పక్కనున్న పిట్టగోడపైకి ఎక్కి సురక్షితమైన ప్రాంతానికి వెళ్లారు.

చెన్నైలో దంచికొట్టిన వాన..

తమిళనాడులోని చెన్నై(chennai floods today), తిరువళ్లూరు, కంజివరం, రాణిపేట్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఈ వాయుగుండం ప్రభావంతో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా చెన్నై సహా పొరుగున ఉన్న చెంగల్‌పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం తదితర జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. రహదారులపై మోకాలు లోతులో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇళ్లు, ఆస్పత్రుల్లోకి వరద నీరు చేరి.. ప్రజలు అవస్థలు పడుతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే దాదాపు 91 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details