రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈరోజు ఉత్తర, ఈశాన్య, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వడగండ్లతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడనున్నట్లు తెలిపింది.
రాగల 3 రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు..! - hyderabad weather report
రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, ఈశాన్య, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఈరోజు వడగండ్లతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడనున్నట్లు ప్రకటించింది.
![రాగల 3 రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు..! heavy rains in telangana for three days](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11719665-76-11719665-1620727955698.jpg)
heavy rains in telangana for three days
విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతూ... ఈరోజు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల వరకు ఏర్పడిందని తెలిపింది. నిన్నటి ఉత్తర- దక్షిణ ద్రోణి ఈరోజు... విదర్భ దాని పరిసర ప్రాంతాల నుంచి మరత్వాడ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల వరకు ఏర్పడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది.