రాష్ట్రంలో ఈ రోజు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామ, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
నివర్ ఎఫెక్ట్: రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు - తెలంగాణపై నివర్ తుఫాను ప్రభావం
నివర్ ప్రభావం రాష్ట్రంపై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు కొన్ని చోట్ల, ఎల్లుండి ఒకటి రెండు చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
రేపు సైతం కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముండగా... ఎల్లుండి ఒకటి రెండు చోట్ల జల్లులు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర కోస్తా తమిళనాడు ప్రాంతంలో కొనసాగుతున్న నివర్ తీవ్ర తుఫాను వాయువ్య దిశగా ప్రయాణించి తుఫానుగా బలహీనపడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 6 గంటల్లో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారి... తదుపరి 6 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని సంచాలకులు పేర్కొన్నారు.