బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద శనివారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఆవర్తనం ఉంది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలుల్లో అస్థిరత ఏర్పడి దక్షిణం వైపు వీస్తున్నాయి. రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శనివారం రాష్ట్రంలో విస్తారంగా వానలు కురిశాయి. వర్షాలతో చెరువులు జలకళ సంతరించుకుంటున్నాయి.
Heavy Rains: రాష్ట్రంలో నేడూ, రేపూ భారీ వర్షాలు
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నేడూ, రేపూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శనివారం విస్తారంగా వానలు కురిశాయి. వర్షాలతో చెరువులు జలకళ సంతరించుకుంటున్నాయి. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్టులోకి వరద నీరు పెరుగుతుండటంతో..... మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
భారీ వర్షాలు
హనుమకొండ జిల్లా వంగర గ్రామ చెరువు. నిండుకుండలా మారి మత్తడి దుంకుతోంది. గ్రామస్థులు మోకాళ్ల లోతు నీటిలో రాకపోకలు సాగిస్తున్నారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్టులోకి వరద నీరు పెరుగుతుండటంతో..... మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. హైదరాబాద్‌లో అనేకచోట్ల రహదారులు జలమయమయ్యాయి. ఖమ్మంలోనూ భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు నిలిచింది.
ఇదీ చదవండి:Padayatra: కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకలిస్తాం: బండి సంజయ్