Hyderabad Rains: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, అల్విన్‌కాలనీ, కేపీహెచ్‌బీ, కోఠి, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, షేక్‌పేట, లక్డికాపూల్, హిమాయత్‌నగర్, నారాయణ గూడ, లిబర్టీ, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, సైదాబాద్, శంషాబాద్, సాతంరాయి, గగన్‌పహాడ్, తొండుపల్లిలో వర్షం కురిసింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, కిస్మత్పూర్, బండ్లగూడ జాగిర్, గండిపేట్, మణికొండ, పుప్పల్‌గూడా, ఆరాంఘర్ ప్రాంతాలలోనూ వర్షం కురిసింది.
యూసుఫ్‌గూడా ప్రాంతంలో ఒక్కసారిగా కుండపోత వర్షం కురియటంతో.. రహదారులన్ని జలమయమయ్యాయి. శ్రీకృష్ణనగర్- బి బ్లాక్ కమ్యూనిటీ హాల్ వీధి, సింధు టిఫిన్ సెంటర్ వీధిలో వరద నీరు పొంగుతోంది. రోడ్లపై నిలిపి ఉంచిన వాహనాలు వాన నీటిలో మునిగిపోయాయి. మోకాళ్ల వరకు వరద వస్తుండటంతో.. స్థానికులతో పాటు వాహనాదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతవరకు సాధారణంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై.. కుండపోతగా వర్షం కురియటంతో నగరవాసులు తడిసిముద్దయ్యారు. రహదారులపై వర్షం నీరు పొంగటంతో.. వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.