తెలంగాణ

telangana

ETV Bharat / city

vishaka: విశాఖలో పొంగుతున్న వాగులు..వాహనదారులకు తప్పని తిప్పలు - ap news

ఏపీలోని విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. గట్టు దాటేందుకు వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

heavy rains
వర్షాలు

By

Published : Aug 14, 2021, 11:59 AM IST

ఏపీలోని విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముంచంగిపుట్టు మండలం బంగాపుట్టుకు చెందిన స్థానికులు జీపులో బిర్రిగూడ వాగును దాటుతుండగా.. జీపు అందులో చిక్కుకుపోయింది. అప్రమత్తమైన డ్రైవర్‌ జీపు నుంచి అందరినీ దింపివేయగా ప్రమాదం తప్పింది. తర్వాత ట్రాక్టర్ తెచ్చి జీపును ఒడ్డుకు చేర్చారు. వాగులో చిక్కుకున్న ద్విచక్ర వాహనాలనూ ప్రమాదకర స్థితిలో స్థానికులు ఒడ్డుకు చేర్చారు. వర్షాలకు తరచూ ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాగుల పై వంతెన నిర్మించాలని కోరుతున్నారు.

vishaka: విశాఖలో పొంగుతున్న వాగులు..వాహనదారులకు తప్పని తిప్పలు

ABOUT THE AUTHOR

...view details