ఏపీలోని నెల్లూరు(rains in nellore)జిల్లాలో గల స్వర్ణముఖి నది (swarnamukhi river) ప్రవాహం ఉద్ధృతంగా మారింది. నాయుడుపేట నుంచి వెంకటగిరి వెళ్లే నది వంతెనపై మూడు నాలుగు అడుగుల మేర నీరు పారుతోంది. మేనకూరు సెజ్‌లోని కంపెనీల ఉద్యోగులు, కార్మిక సిబ్బంది బస్సులు ఈ మార్గంలో పోవడం లేదు. స్వర్ణముఖి నది ప్రవాహంతో పెళ్లకూరు మండలంలోని పలు ప్రాంతాల్లో గల వ్యవసాయ పొలాలు కోతకు గురవుతున్నాయి. రైతులకు తీరని నష్టం వాటిల్లింది. పెళ్లకూరు మండలం పుల్లూరు ముమ్మారెడ్డిగుంట మధ్య నీటి పారుదల పెరిగి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిలో ప్రమాదకరంగా దాటారు.
పొంగి పొర్లుతున్న వాగులు..
గూడూరు రూరల్(rains in ap) సర్కిల్ పరిధిలోని చిల్లకూరు, మనుబోలు, సైదాపురం, గూడూరు ప్రాంతాల్లో అధికారులు... పోలీసులను (police alert) అప్రమత్తం చేశారు. ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గ్రామ మహిళా పోలీసుల సేవలు కూడా వినియోగించుకుంటున్నారు. సైదాపురం మండలం పొదలకూరు మార్గంలోని మాలేరు వాగు, పిన్నేరు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మనుబోలు మండల పరిధిలోని పంబలేరు, చల్లకాలువ వాగులు సైతం ఉధృతంగా పారుతున్నాయి. వెంకటగిరిలో రెండు రోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కైవల్యా నది పరవళ్లు తొక్కుతుంది. వెంకటగిరి కాశీ విశ్వనాథ స్వామి ఆలయం దగ్గర నది ప్రవాహం కొనసాగుతూ ఉంది. బాలాయపల్లి మండలం నిండలి దగ్గరి కాజ్వేపై కైవల్యా పొంగి పోర్లుతుండటంతో నిన్నట్నుంచి ఈ మార్గంలో రాకపోకలు కొనసాగడం లేదు.
తృటిలో తప్పిన ప్రమాదం..