జంటనగరాల్లో శుక్రవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. సికింద్రాబాద్, ఉప్పల్, సనత్‌నగర్, బేగంపేట, ఎర్రగడ్డ, ఖైరతాబాద్, లక్డీకాపూల్, అమీర్‌పేట్, అబిడ్స్, నాంపల్లి, బేగంబజార్, సుల్తాన్ బజార్, కోఠి, నారాయణగూడ, హిమాయత్‌నగర్, చాదర్‌ఘాట్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడింది. పలుచోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి.
హైదరాబాద్‌లో భారీ వర్షం.. జీహెచ్‌ఎంసీ అప్రమత్తం - హైదరాబాద్‌లో భారీ వర్షం
అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌లో భారీ వర్షం పడింది. నగర శివారు ప్రాంతాల్లోనూ... తేలిక పాటి నుంచి భారీవర్షాలు కురిశాయి. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికతో బల్దియా అధికారులు అప్రమత్తమయ్యారు .
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల రెండు రోజులు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్నం తెలిపారు. గడిచిన 24గంటల్లో ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్, ఆ తరువాత రెండు రోజులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని వెల్లడించారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు సాధారణం కన్నా 45శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైందని వివరించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు సహాయ బృందాలను అప్రమత్తం చేశారు.
ఇదీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వానలు.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి!