తెలంగాణ

telangana

ETV Bharat / city

రాకపోకలకు మరోసారి అవాంతరాలు... వాహనాల దారి మళ్లింపు - heavy rains in hyderabad

నగరంలో కురుస్తున్న వర్షానికి రాకపోకలకు మరోసారి అవాంతరాలు ఏర్పడ్డాయి. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవటం వల్ల ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల నీరు అధికంగా నిలవటం వల్ల వాహనాలను అధికారులు దారి మళ్లిస్తున్నారు.

heavy rains in hyderabad and traffic diversion
heavy rains in hyderabad and traffic diversion

By

Published : Oct 17, 2020, 9:46 PM IST

హైదరాబాద్​- బెంగళూర్ జాతీయ రహదారిపై రాకపోకలకు మరోసారి అవాంతరాలు ఏర్పడ్డాయి. గగన్​పహాడ్ వద్ద జాతీయ రహదారిపై వర్షపు నీరు వచ్చి చేరడం వల్ల ట్రాఫిక్ పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఆ మార్గం మీదుగా వాహనాలను వెళ్లనీయడం లేదు. హైదరాబాద్ నుంచి పీవీ ఎక్స్​ప్రెస్​వే మీదుగా విమానాశ్రయం, బెంగళూర్ వైపు వెళ్లే వాహనాలను పోలీసులు దారి మళ్లిస్తున్నారు.

హైదరాబాద్ నుంచి బెంగళూర్ వైపు వెళ్లే వాహనదారులు, బెంగళూర్ వైపు నుంచి వచ్చే వాహనదారులు బాహ్యవలయ రహదారి మీదుగా రాకపోకలు కొనసాగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. తెగిపోయిన అప్పా చెరువు కట్టను అధికారులు పునరుద్ధరించారు. మూడు రోజుల క్రితం జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు.

సాయంత్రం కురిసిన వర్షం వల్ల మెహదీపట్నం, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి రహదారిపై వాహనాలు రద్దీ ఏర్పడింది. వర్షం వల్ల పలు చోట్ల రహదారిపై వర్షపు నీళ్లు నిలిచాయి. వాహనాలను గచ్చిబౌలి, నానక్​రాంగూడ, నార్సింగి, లంగర్​హౌజ్​, నాలన్​నగర్, మెహదీపట్నం మీదుగా వాహనాలను దారి మళ్లిస్తున్నారు.

ఇదీ చూడండి: మళ్లీ వర్షం.. హైవేపై నిలిచిన వాహన రాకపోకలు

ABOUT THE AUTHOR

...view details