భాగ్యనగర వాసులకు ఎట్టకేలకు ఉపశమనం కలిగింది. వరుణుడి రాకతో నగర రహదారులన్నీ జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట, ఖైరతాబాద్, ఎర్రగడ్డ, సనత్నగర్, బేగంపేట, నాంపల్లి, అంబర్పేట, కాచిగూడ, మెహదీపట్నం, దిల్సుఖ్నగర్, మంగల్హాట్, వనస్థలిపురం, హయత్నగర్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. బేగంబజార్, కోఠి, సుల్తానాబజార్, అబిడ్స్, నాంపల్లి వంటి ప్రాంతాల్లో ఈదులుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ప్రధానకూడళ్లలో రోడ్లపై నీరు నిలిచిపోవడం వల్ల వాహనదారులు అవస్థలకు గురయ్యారు. సుమారు అర్ధగంట వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది.
రాజధానిలో మళ్లీ వర్షం పడింది... - భాగ్యనగరంలో వర్షం
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వరుణుడి రాకతో వాతావరణం చల్లబడింది.
రాజధానిలో మళ్లీ వర్షం పడింది...