భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా(heavy rainfall in Anantapur) కదిరి జలదిగ్బంధంలో చిక్కుకుంది. అన్ని వైపులా వర్షపు నీరు చుట్టముట్టడంతో ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మద్దిలేరు నది ప్రవాహ ఉద్ధృతికి బెంగళూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. కుటాగుల రైల్వే గేట్ సమీపంలో రోడ్డు మీద 5 అడుగుల మేర వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాలకు శింగనమలలో వందల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ఆరుగాలం శ్రమించిన పంట కోతకొచ్చే సమయంలో నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారీ వర్షాలకు అనంతపురం అతలాకుతలం నార్పల మండల కేంద్రంలోని కూతలేరు బ్రిడ్జి వద్ద నిర్మించిన డైవర్షన్ రోడ్డుపై వరద నీరు(heavy rainfall in Anantapur) ప్రవహిస్తోంది. ఫలితంగా నార్పల, గూగుడు మధ్య రాకపోకలు స్తంభించాయి. గోరంట్ల వద్ద చిత్రావతి నది ఉప్పొంగుతోంది. భారీ వాహనాలు వంతెనపై వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. భారీ వర్షాలకు హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా చెరువులు, వాగుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. చిలమత్తూరు మండలంలో చిత్రావతి, కుషావతి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
ఇల్లు కూలి ఒకరు మృతి...
డీకేపల్లి మండలం వెల్దుర్తి వద్ద చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహంలో ఓ కారు కొట్టుకుపోయింది. కారులో చిక్కుకున్న నలుగురిని ప్రొక్లెయిన్ సాయంతో స్థానికులు కాపాడారు. వరద ప్రవాహంలో చిక్కుకుపోయిన ప్రొక్లెయిన్‌పై ఉన్న 9 మందిని కాపాడేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. రామగిరి మండలం గంతిమర్రిలో వర్షానికి ఇల్లు కూలి రంజిత్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
రిజర్వాయర్‌కు గండి..
బేలుగుప్ప మండలం జీడిపల్లి(heavy rainfall in Anantapur) గ్రామంలో గురువారం రాత్రి తీవ్ర అలజడి నెలకొంది. రిజర్వాయర్ వద్ద చిన్న గండి పడినట్లు కొందరు వ్యక్తులు గ్రామస్థులకు సమాచారం ఇవ్వగా గ్రామం మొత్తం అప్రమత్తమయ్యారు. గండి పండింది నిజమో కాదో తెలియక.. ఎప్పుడేం జరుగుతుందో అని జీడిపల్లి గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్థులు మొత్తం ఎక్కడ గండి పడిందో అని లైట్లు వేసుకొని వెతికారు. దిగువ ప్రాంతంలో హంద్రీనీవా కాలువకు గండి పడటంతో రిజర్వాయర్ గేట్లు మూసేశారు. దీంతో ఒక్కసారిగా రిజర్వాయర్‌కు నీటిమట్టం అధికమైంది. రిజర్వాయర్ తూములు తెరిచి నీరు వదిలితే సమస్య పరిష్కరం అవుతుందని గ్రామస్థులు తెలిపారు. అయితే తీవ్ర వర్షం కారణంగా ఎక్కడ గండి పడిందో తెలియక గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే సాధారణంగా గ్రామంలో ఎప్పుడు ఊట నీళ్లు వస్తూనే ఉంటాయి. గండి పడిందని చెప్పిన ప్రాంతంలో నీళ్లు ఎక్కువగా వస్తుండటంతో చెట్లు, రాళ్లు ఉండటంతో చీకటిలో అక్కడికి వెళ్లేందుకు ఎవరు కూడా సాహసించలేదు.
అయితే గ్రామ సర్పంచ్ వెంకట నాయుడు 'ఈటీవీ ప్రతినిధికి' చరవాణి ద్వారా సమాచారం ఇవ్వగా.. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్‌కు విషయాన్ని తెలిపారు. కలెక్టర్ గ్రామ సర్పంచ్ వెంకట నాయుడుతో మాట్లాడి ధైర్యం చెప్పారు. హుటాహుటిన కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేసి గ్రామానికి వెళ్లి పరిస్థితిని తెలుసుకొని.. అవసరమైతే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్థులు ఎవరూ భయపడకుండా ధైర్యంగా(heavy rainfall in Anantapur) ఉండాలని కలెక్టర్ సూచించారు. గ్రామంలో ఉన్న ప్రజలంతా వారి పిల్లలను తీసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
ఇదీచదవండి:KTR tweet today: పదవుల్లో ఉన్నవారి కంటే ప్రజల అధికారం గొప్పది: కేటీఆర్