నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణలోని కొంత భాగంలోకే ప్రవేశించాయని రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లోకి విస్తరిస్తాయని తెలిపింది.
Weather Report: రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు..! - weather forecast hyderabad
రాష్ట్రంలోకి రుతుపవనాల రాకతో రాగల మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి. ఈరోజు ముఖ్యంగా కిందిస్థాయి గాలులు నైరుతి దిశగా రాష్ట్రంలో వీస్తున్నాయని వాతావరణశాఖ పేర్కొంది.
heavy rains for three days in telangana
రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు ముఖ్యంగా కిందిస్థాయి గాలులు నైరుతి దిశగా రాష్ట్రంలో వీస్తున్నాయని పేర్కొంది.