ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Ts weather report: మరో రెండు రోజులు భారీ వర్షాలు - తెలంగాణ వాతావరణం
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పలు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలను అప్రమత్తం చేసింది.
rains
23, 24 తేదీల్లో నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ గ్రామీణం, వరంగల్ అర్బన్, జనగామ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు వివరించింది.
ఇదీ చూడండి:ఉప్పొంగిన వాగులు.. వరదలో చిక్కిన కార్మికులు