తెలంగాణ

telangana

ETV Bharat / city

HYD: వానాకాలం మొత్తం కురవాల్సిన వానలు రెండు వారాల్లోనే దంచేశాయ్‌.. - telangana varthalu

రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్​ నగరంలో ఈ ఏడాది జులైలోనే రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. గత పదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది జులై నెలలో అత్యధికంగా వర్షం కురిసింది. వానాకాలం మొత్తం కురియాల్సిన వానలు కేవలం రెండు వారాల్లోనే దంచికొట్టాయి.

HYD: వానకాలం మొత్తం కురవాల్సిన వానలు రెండు వారాల్లోనే దంచేశాయ్‌..
HYD: వానకాలం మొత్తం కురవాల్సిన వానలు రెండు వారాల్లోనే దంచేశాయ్‌..

By

Published : Jul 23, 2021, 2:18 PM IST

హైదరాబాద్‌ నగరంలో ఈ ఏడాది జులైలోనే రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. వానాకాలం మొత్తం కురియాల్సిన వానలు కేవలం రెండు వారాల్లోనే దంచికొట్టాయి. దీంతో గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. పక్షం రోజుల వ్యవధిలో 25 సెం.మీ. నుంచి 40 సెం.మీ. వాన పడింది. ఆల్‌టైమ్‌ రికార్డు 42.2 సెం.మీ. వాన 1989లో నమోదైంది. ఇటీవల వానలతో సగటున గ్రేటర్‌లో 20 సెం.మీ.పైన వర్షం పడింది. నగరంలో జూన్‌, జులైలో సాధారణ వర్షపాతం 276.5 మి.మీ. కాగా.. రంగారెడ్డిలో 244.7 మి.మీ., మేడ్చల్‌ జిల్లాలో 287.6 మి.మీ.గా ఉంది. నెల ముగిసేందుకు ఇంకా వారం రోజులు మిగిలి ఉండగానే ఆయా జిల్లాల పరిధిలోని చాలా ప్రాంతాల్లో 400 మి.మీ.పైన వర్షపాతం నమోదైంది.

రెండు నెలల్లో 400 మి.మీ.పైన వానలు పడిన ప్రాంతాలు

హయత్‌నగర్‌, సరూర్‌నగర్‌, ఉప్పల్‌, కాప్రా, బాలానగర్‌, మల్కాజిగిరి, మారేడుపల్లి, ముషీరాబాద్‌, అసిఫ్‌నగర్‌

251 - 400 మి.మీ. మధ్యలో..

● కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, షేక్‌పేట, గోల్కొండ, ఖైరతాబాద్‌, హిమాయత్‌నగర్‌, నాంపల్లి, అంబర్‌పేట, సైదాబాద్‌, బహుదూర్‌పుర, రాజేంద్రనగర్‌, బండ్లగూడ, చార్మినార్‌

అతి ఎక్కువగా నమోదైన ప్రాంతాలు (60 శాతం అధికం)

● పటాన్‌చెరు, కూకట్‌పల్లి, బాలానగర్‌, అంబర్‌పేట, ఖైరతాబాద్‌, షేక్‌పేట, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, ముషీరాబాద్‌, కాప్రా, ఉప్పల్‌, సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌, చార్మినార్‌, సైదరాబాద్‌, నాంపల్లి

ఎక్కువగా ( 20-59 శాతం అధికం)

● రాజేంద్రనగర్‌, బండ్లగూడ, బహుదూర్‌పుర, గోల్కొండ, హిమాయత్‌నగర్‌, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, అల్వాల్‌.

సాధారణం కంటే వంద శాతం అధికంగా నమోదైన ప్రాంతాలు(జూన్​, జులైలో)

  • అబ్దుల్లాపూర్​మెట్​: 172%
  • ఉప్పల్​: 150%
  • కాప్రా:128%
  • ఘట్​కేసర్​: 115%
  • ముషీరాబాద్​:115%
  • శామీర్​పేట:116%
  • కీసర: 102%
  • మేడిపల్లి: 102%

వర్షపాతం వివరాలు (గురువారం ఉదయం 8.30 నుంచి రాత్రి 8గంటల వరకు) (మి.మీ.లలో)

సైదాబాద్​-24.8

మాదాపూర్​-24.3

రామచంద్రాపురం-21.5

అసిఫ్​నగర్​-20.8

గచ్చిబౌలి-20.0

చందానగర్​-19.0

బోరబండ-18.5

అల్లాపూర్​-18.3

ఎల్​బీనగర్​-18.3

హైదరాబాద్​లో జులై నెల వర్షపాతం(మి.మీ)

సంవత్సరం వర్షపాతం (మి.మీ)
2020 129.2
2019 93.2
2018 92.0
2017 165.0
2016 195.2
2015 38.4
2014 174.2
2013 197.2
2012 232.4
2011 185.9


ఇదీ చదవండి: Rain : ఏకధాటి వానలు.. ఉప్పొంగుతున్న వాగులు.. ఆందోళనలో ప్రజలు

ABOUT THE AUTHOR

...view details