హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గత వారం రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న భాగ్యనగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. వివిధ పనులపై బయటకు వచ్చిన నగరవాసులు.. తడిసి ముద్దయ్యారు.
అసెంబ్లీ, బషీర్బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, మాదాపుర్, గచ్చిబౌలి, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. రహదారులపైకి నీరు రావడంతో.. వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షధాటిని తట్టుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ప్రజలు వెతుక్కున్నారు.
వాతావరణ శాఖ సూచన
రాష్ట్రంలో కొన్నిచోట్ల రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే (Rains in Telangana) అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center) వెల్లడించింది. కింది స్థాయి గాలులు తూర్పు, ఈశాన్య దిశల నుంచి ఇవాళ రాష్ట్రం వైపునకు వస్తున్నాయని వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Center) సంచాలకులు తెలిపారు. ఈ నెల 6నుంచి వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు తిరోగమించే అవకాశాలున్నాయని సంచాలకులు వివరించారు.
ఇటీవల గులాబ్ తుపానుతో అతలాకుతలం
గులాబ్ తుపాను రాష్ట్రంలోని పలు జిల్లాలను వణికించింది. భారీ వర్షాలతో(Heavy Rain in HYDERABAD) రాజధానిని ముంచెత్తింది. అధిక వర్షాలతో పలు ప్రాంతాల్లో కాలనీలు, రోడ్లు నీటమునిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు నిండిపోయాయి.
RAIN IN HYDERABAD: భాగ్యనగరంలో భారీ వర్షం.. ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం ఇవీ చూడండి: