తెలంగాణ

telangana

ETV Bharat / city

Heavy Rain: విజయవాడలో భారీ వర్షం.. పలుచోట్ల పిడుగుపాటు - Rain Lashed Vijayawada

Heavy rain in Vijayawada: విజయవాడలో ఆకస్మికంగా ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా పిడుగులు పడటంతో నగర వాసులు అదిరిపడ్డారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడటంతో రహదారులపై ప్రయాణిస్తున్న వారంతా భయాందోళనలకు గురయ్యారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాలతో పాటు శివారు ప్రాంతాలపై కూడా సుమారు పది నుంచి పదిహేను పిడుగుల వరకూ పడినట్టు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల్లో పడిన పిడుగుల కారణంగా విద్యుత్ ఉపకరణాలు కాలిపోయి ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది.

Heavy Rain
Heavy Rain

By

Published : Sep 28, 2022, 5:15 PM IST

Heavy Rain Lashed: ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఆకాశం మేఘావృతంగా ఉందని.. వివిధ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ కేంద్రం తెలిపినట్లుగానే విజయవాడలో భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అప్పటివరకు చల్లని మేఘాలతో నిండి ఉన్న ఆకాశంలో అలజడి మెుదలైంది. ఒక్కసారిగా పిడుగులతో కూడిన వర్షం కురిసింది.

వర్షానికి నగరం మెుత్తం జలమయమైయింది. సుమారు పది నుంచి పదిహేను చోట్ల పిడుగులు పిడినట్లు తెలుస్తోంది. పిడుగులు పడిన సమయంలో చాలా ఇళ్లలో విద్యుత్ ఉపకరణాలు కాలిపోయాయి. ఉరుములకు భయపడి ప్రజలు బయట అడుగు పెట్టే సాహసం చేయలేదు. ఇంతలా పిడుగులతో కూడి వర్షాన్ని నగరంలో ఎన్నడు చూడలేదని స్థానికులు పేర్కొంటున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details