తెలంగాణ

telangana

ETV Bharat / city

తడిసిముద్దైన సికింద్రాబాద్.. రికార్డ్ స్థాయిలో వర్షం.. - secunderabad

మంగళవారం కురిసిన భారీవర్షంతో సికింద్రాబాద్ నగరం తడిసి ముద్దైంది. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన వానతో లోతట్టు ప్రాంతాలతో పాటు.. ప్రధాన రహదారులు నదులను తలపించాయి.

తడిసిముద్దైన సికింద్రాబాద్.. రికార్డ్ స్థాయిలో వర్షం..

By

Published : Sep 25, 2019, 9:12 AM IST

Updated : Sep 25, 2019, 10:29 AM IST


నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సికింద్రాబాద్ నగరం అతలాకుతమైంది. ప్రధానంగా మారేడ్​పల్లి బోయిన్​పల్లి తిరుమలగిరిలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షం పడింది. ప్యాట్ని, ప్యారడైజ్, కార్ఖానా, అల్వాల్ ప్రాంతాల్లో రాత్రంగా కురిసిన వానకు.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

రోడ్లు, కాలువలు కలిసిపోయాయి...

వరదనీటితో రోడ్లన్నీ పొంగిపొర్లుతున్నాయి. డ్రైనేజీలు పొంగిపొర్లి రహదారులపైకి చేరాయి. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్​లతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇళ్లలోకి నీరు.. తడిచిపోయిన వస్తువులు...

కార్ఖానా పరిధిలోని వాసవి నగర్​లో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పలుచోట్ల సామగ్రి పూర్తిగా తడిసిపోయి పనికిరాకుండా అయ్యాయని వాపోయారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇళ్లలోకి వచ్చిన నీటిని ఎత్తి బయటపోస్తున్నారు. స్థానిక డిమార్ట్​లోకి కూడా వరద నీరు వచ్చి భారీనష్టం జరిగింది.

పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నా.. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు.

తడిసిముద్దైన సికింద్రాబాద్.. రికార్డ్ స్థాయిలో వర్షం..

ఇవీచూడండి: భాగ్యనగరంలో భారీవర్షం.. రోడ్లన్నీ జలమయం

Last Updated : Sep 25, 2019, 10:29 AM IST

ABOUT THE AUTHOR

...view details