తెలంగాణ

telangana

ETV Bharat / city

నగరంలో కుండపోత వర్షం... రహదారులన్ని జలమయం - hyderabad weather report

ఉక్కపోతతో ఇబ్బందిపడ్డ నగరవాసులను వరుణుడు పలకరించాడు. ఒక్కసారిగా మేఘావృతమై... కుండపోతగా వర్షం కురిసింది. రెండు గంటలపాటు కురిసిన వర్షంతో రహదారులన్నీ జలమయం కాగా... లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపించాయి.

heavy rain in hyderabad for two hours
heavy rain in hyderabad for two hours

By

Published : Sep 16, 2020, 7:42 PM IST

Updated : Sep 16, 2020, 10:23 PM IST

హైదరాబాద్​లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై... మబ్బు విరిగి పడ్డట్టుగా వాన పడింది. రెండు గంటల పాటు భారీ వర్షం కురియటం వల్ల రహదారులు మొత్తం జలమయమయ్యాయి. రోడ్ల వెంట వెళ్లేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాంపల్లి, ఖైరతాబాద్, కోఠి, చార్మినార్, పంజాగుట్ట, సికింద్రాబాద్, తార్నాక,ఉప్పల్, హబ్సిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్​లో కురిసిన వర్షానికి నాలాలు పొంగి పొర్లాయి.

రోడ్లన్ని జలమయం...

ఎంజే మార్కెట్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్​, అబిడ్స్, నాంపల్లి, బషీర్​బాగ్, నారాయణగూడ, హిమాయత్​నగర్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వాన కురిసింది. కుండపోతగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. చంపాపేట్​లోని సాగర్ ప్రధాన రహదారిపై భారీగా నీరు చేరటం వల్ల ట్రాఫిక్​కు ఇబ్బంది కలిగింది.

చెరువుల్లా సెల్లార్లు...

లోతట్టు ప్రాంతాలన్ని జలమయం కాగా... పలు భవనాల్లోని సెల్లర్లు, ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. కాలనీ వాసులు, దుకాణ సముదాయదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలు సైతం నీటిలో మునిగిపోయాయి.

ఇదీ చూడండి: వాగులో కొట్టుకుపోయిన 8 మంది కుటుంబసభ్యులు

Last Updated : Sep 16, 2020, 10:23 PM IST

ABOUT THE AUTHOR

...view details