తెలంగాణ

telangana

భాగ్యనగరంలో వర్షం... ట్రాఫిక్​కు అంతరాయం

By

Published : Sep 10, 2020, 3:55 PM IST

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఇటీవల ఎండలతో సతమతమవుతున్న భాగ్యనగర వాసులకు ఈ వర్షం ఒకింత ఊరటనిచ్చింది. కానీ రోడ్లపై భారీగా నీరు చేరడం, చెట్లు విరిగిపడటంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Heavy Rain Hyderabad city
భాగ్యనగరంలో వర్షం... పులకరించిన జనం

హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం కురిసింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో గురువారం మధ్యాహ్నం నగరంలో ఈదరుగాలులతో కూడిన వర్షం కురిసింది. నల్లటి మేఘాలు కమ్ముకోవటం వల్ల పట్టపగలే చీకట్లు ఆవరించాయి.

అంబర్​పేట, సైదాబాద్ ,చంపాపేట, సరూర్‌నగర్‌, రామంతాపూర్‌, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. నగరంలో గంటసేపు వర్షం ఆగకుండా కురవడం వల్ల.. రోడ్లపై నీరు నిలిచిపోయి వాహనదారులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొన్నారు.

భాగ్యనగరంలో వర్షం... పులకరించిన జనం

ఇదీ చూడండి: శ్రావణి ఆత్మహత్య కేసు: విచారణకు హాజరైన దేవరాజ్

ABOUT THE AUTHOR

...view details